మెగా జాబ్ మేళాతో గిరి యువతలో ‘పరివర్తన’..


Ens Balu
2
Kakinada
2021-12-16 12:55:23

తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మన్యంలోని గిరిజన యువతకు పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించే వినూత్న కార్యక్రమం చేపట్టారు.దానికోసం జిల్లాలోని చింతూరులో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు. ముఖ్యంగా గంజాయి, నాటు సారా రవాణతో యువత పెడత్రోవపట్టకుండా గిరియువతకు ఉపాది, ఉద్యోగాలు  చూపడం ద్వారా వారిలో పరివర్తన పెంచాలనే ఎస్పీ ఆకాంక్షించారు. అందులోభాగంగానే పలు ప్రైవేలు కంపెనీల ప్రతినిధులతోనూ, ఐటీడీఏల పీఓలతోనూ ప్రత్యేకంగా చర్చించి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం చింతూరు జిల్లా పరిషత్ హైస్కూలు వేదికగా శుక్రవారం జరగనుంది. గిరియువత భవిష్యత్తు కొండలకు, ముక్కూ మహం తెలియని అక్రమ వ్యాపారులు వారిచ్చే కొద్దో గొప్పో డబ్బులకు లోనుకాకుండా వారిలో పరివర్తన తీసుకువచ్చి మార్పుచేసేందుకు జిల్లాపోలీస్ శాఖ ఈ జాబ్ మేళాతో ఒక అడ్డుకట్టన వేయనుంది.రేపు జరిగే ఈ మెగా జాబ్ మేళాలో వందలాది మంది యువతకు ఉపాది, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.