యువతకి వ్యక్తిత్వ వికాసం పై ఉచిత శిక్షణ..


Ens Balu
2
Srikakulam
2020-09-14 20:50:18

యువతకు ఉచితంగా ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ (సెట్ శ్రీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాస రావు తెలిపారు.  ఈ మేరకు సోమ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికితీయడం, అదే విధంగా వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిచ డానికి, యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 15-35 సం. మధ్య వయస్సు కలిగిన యువతీ యువకులకు మహత్తరమైన అవకాశాన్ని కల్పిస్తూ నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, యువ నాయకత్వాలపై అంతర్జాలము వేదికగా ఉచిత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి సంకల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమము ప్రతి శనివారం నిర్వహించబడం జరుగుతుందని ఆయన వివరించారు. విజయవాడ రమకృష్ణ మఠానికి చెందిన స్వామి సవ్యానంద వంటి ప్రముఖులు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొని ఆన్ లైన్ ద్వారా వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు వంటి కార్యక్రమాలపై శిక్షణ ఇస్తారని వివరించారు.  ఆసక్తి, అర్హత గల యువతీ, యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస రావు కోరారు. http://tiny.cc/personalitydevelopment వెబ్ సైట్ లో యవత వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఆప్ లైన్ ద్వారా నమోదు చేసుకొన్న అభ్యర్థులకు 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు ఆన్ లైన్ లో "నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, యువ నాయకత్వం" పై ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు.  వివరములకు కార్యాలయం పని దినములలో సెట్ శ్రీ మేనేజరు బి.వి. ప్రసాదరావును 8341478815, 08942240601 నంబరు ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.