తూ.గో.జిలో కేజి పట్టుగూళ్లకు రూ.740 వరకూ ధర..


Ens Balu
6
Kakinada
2021-12-22 06:53:04

తూర్పుగోదావరి జిల్లాలో పట్టుగూళ్లకు మంచి మద్దతు ధరల రైతులకు పలుకుతుందని సెరీకల్చర్ డిప్యూటీ డైరెక్టర్ రామరాజు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన కాకినాడలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పట్టుగూళ్లకు కేజికి రూ.700 నుంచి రూ.740 వరకూ ధర పలుకుతుందన్నారు. జిల్లాలో 1200 మంది రైతులు మూడువేల ఎకరాల్లో మల్బరీ సాగు చేపడుతున్నట్టు ఆయన వివరించారు. చేబ్రోలులో పట్టుగూళ్ల మార్కెట్ నిర్వహణ జరుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం చైనా నుంచి పట్టుగూళ్ల దిగుమతి నిలిచి పోవడంతో దేశీయంగా పండించిన పట్టుగూళ్లకు మంచి గిరాకీ లభిస్తుందని సెరీకల్చర్ డీడీ రామరాజు ఈ సందర్భంగా మీడియాకి వివరించారు.