తూర్పుగోదావరి జిల్లాలో 10 మందికి కరోనా..
Ens Balu
5
Kakinada
2021-12-22 13:15:45
తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం 5మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.గౌరీశ్వర్రావు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కాకినాడలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతూ వస్తుందన్నారు.జిల్లాలో ప్రస్తుతం 200 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 1290 మంది కోవిడ్ తో మ్రుత్యువాత పడ్డారని చెప్పారు. జిల్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 95వేల 31కి చేరుకున్నాయని అదే సమయంలో కోవిడ్ వైరస్ వచ్చి కోలుకున్నవారు రెండు లక్షల 93వేల 541 మందిగా నమోదు అయ్యారని పేర్కొన్నారు. ఆరు కోవిడ్ కేర్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగుల కోసం 2వేల 867 బెడ్లు అందుబాటులో ఉన్నాయని డిఎంహెచ్ఓ గౌరీశ్రర్రావు ఈ సందర్భంగా ప్రకటనలో తెలియజేశారు.