తూర్పుగోదావరి జిల్లాలోని రైతుబజార్లలో ఎల్ఈడీ బోర్డులు, కేంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ సహాయం సంచాలకులు సూర్యప్రకాశరెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కాకినాడ రూరల్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఆలమూరు, అమలాపురం, అంగర, క్యాంటీన్లతోపాటు అన్ని రైతు బజార్లలో ఎల్ ఈడీ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికోసం టెండరు ప్రక్రియ మొదలైందన్నారు. అది పూర్తయితే వినియోగారుల సౌకర్యార్ధం ఈ రెండు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎల్ఈడీ బోర్డులు ద్వారా కూరగాయల ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకో వచ్చునన్నారు. కేంటిన్ ద్వారా రైతు బజార్లకు వచ్చే వారికి రిఫ్రెష్ మెంట్ కలగుతుందని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు చర్యలు చేపట్టినట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ సూర్యప్రకాశరెడ్డి మీడియాకి వివరించారు.