సెర్ప్ లో 14నెలల పారితోషకాలు బకాయి..
Ens Balu
4
Machilipatnam
2020-09-14 21:23:59
సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న కళ్యాణ మిత్రలకు 14 నెలల పారితోషికాల బకాయిలు వెంటనే చెల్లించాలని, పని భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.కమల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో కళ్యాణ మిత్రలతో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ కళ్యాణ మిత్రులకు పారితోషకాలు రెట్టింపు చేసి చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని గతంలోహామీ ఇచ్చారని, కానీ నేటి వరకూ దానిని అమలు చేయాలేదన్నారు. బకాయి పడ్డ14నెలల పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని ఆమె కోరారు. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.ధనశ్రీ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న కళ్యాణ మిత్రలకు ఉద్యోగ భద్రత, తగిన గుర్తింపు నివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సిఐటియు పట్టణ కార్యదర్శిబూర.సుబ్రహ్మణ్యం ధర్నాకు మద్దతు తెలియజేస్తూ కళ్యాణ మిత్రులకు 14 నెలల నుంచి పారితోషికాలు బకాయి ఉండటం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారిని వెంటనే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పి రాజేశ్వరి, జి అరుణ, సిహెచ్. సుమలత, సిహెచ్ అశ్విని, పి దివ్య, శ్రీదేవి, వి. స్వాతి, ఎస్ భవాని ఆర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.