అప్పన్న ప్రహ్లాదమండపం తిరిగి అప్పగించండి..


Ens Balu
13
Visakhapatnam
2021-12-28 10:24:01

విశాఖ మహా నగరం జగదాంబ జంక్షన్ లో ఉన్న సింహాచలం దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండపంను తక్షణమే తిరిగి దేవస్థానానికి అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుల బృందం జిల్లా కలెక్టర్ ను  కోరింది. ఈ మేరకు మంగళవారం  అప్పన్న దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యములో, దశమంతుల మాణిక్యాలరావు, యండమూరి వెంకటరావు(విజయ), ఎస్ఎమ్ రత్నంలు మంత్రి ముత్తంసెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జునను కలక్టర్ కార్యాలయం లో కలిసి ప్రహ్లాదమండపానికి సంబంధించిన వివరాలను విపులంగా తెలియజేశారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలయ ఇవో ఎం.వి సూర్యకళ జిల్లా కలెక్టర్ కి  సీఆర్పీఎ ఫ్ కమాండెంటెంట్ కు రాసిన లేఖలను వీరు కలెక్టర్కు అందజేశారు. మహరాణి పేట సర్వే నెంబర్ 170/2ఎ 176/2ఎ, 183/1లలో 5957 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రహ్లాద కళ్యాణ మండపం విస్తరించి ఉందని, ఈ మండపాన్ని కేవలం ఆరు నెలల కాలానికి సంబంధించి సిఆర్పీఎఫ్ కు తేదీ 22-04-2013న తాత్కాలికంగా వసతి కోసం అప్పగించడం జరిగిందని కలెక్టరు తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ ఉత్తర్వులు మేరకు అప్పల్లో ఈ మండపాన్ని సీఆర్పి ఎఫ్ కేటాయించగా నేటి వరకు కూడా ఆ మండపాన్ని సీఆర్పీఎఫ్ ఖాళీ చేయడం లేదని కలెక్టర్కు వివరించారు. ఇప్పటి వరకు అద్దె రూపంలో సింహాచలం దేవస్థానానికి రూ.5.22,53,300 స్ఆర్ఎఎఫ్ చెల్లించాల్సి ఉందని తెలియజేశారు. ఇందులో అసలు రూ.4,88,34,300 కాగా వడ్డీ రూపంలో రూ.1,34,19,000 కలిపి మొత్తం రూ. 6.22 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రత్యేక ఆహ్వానితులు కలెక్టరు విపులంగా వివరించారు. 2013 నుంచి ఈ మండపాన్ని సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఉంచుకున్నారని, ఇప్పటికైనా అద్దె బకాయిలు చెల్లించి దేవస్థానానికి సహకరించాలని కోరారు. కోవిడ్-19 నేపధ్యంలో ఆదాయం సరిగా రాకపోవడం వల్ల ఉద్యోగుల జీతభత్యాలకే దేవస్థానం ఇబ్బంది పడుతుందని కలెక్టరు వివరించారు. కావున తక్షణమే సీఆర్పీఎఫ్ నుంచి రూ.6.22 కోట్లు అద్దె బకాయిలు చెల్లించే విధంగా తగు ఆదే శాలు ఇవ్వాలని, ఆపై సింహాచలం దేవస్థానానికి నగరంలో ఉన్న ఏకైక ప్రధాన ఆదాయవనరు ప్రహ్లాద కళ్యాణ మండపం తిరిగి అప్పగించే విధంగా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. ప్రత్యేక ఆహ్వానితుల వినతిపై జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ఈ అంశము పై చర్చించడము జరిగిందన్నారు.. వీలైనంత త్వరలో ఈ విషయమై అవసరమైన సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తొలుత వీరంతా కలెక్టర్ను ఘనంగా సత్కరించి అప్పన్న జ్ఞాపికను అందజేశారు.