వెబ్ ఛానల్ అసోసియేషన్ కు గంట్ల శ్రీనుబాబు 25 వేల ఆర్థిక సహాయం..


Ens Balu
12
Visakhapatnam
2021-12-29 14:39:28

సమాజంలోని వార్తా విశేషాలను ప్రజలకు అత్యంత త్వరితగతిన అందించే అంశంలో వెబ్ ఛానల్స్ ఎంతో దోహదపడుతుందని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు, సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ప్రజలకు వార్తలను అందించడంలో వెబ్ ఛానల్ జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన  కొనియాడారు. విశాఖ వెబ్ ఛానల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురి మన్ననలను అందుకుంటున్నారని గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ జర్నలిస్టుల అసోసియేషన్ కు తన వంతుగా 25 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎల్లప్పుడూ నిస్వార్ధంగా పనిచేసే వెబ్ ఛానెల్ జర్నలిస్టులు వార్తల సేకరణలో భాగంగా విశ్రాంతి లేకుండా గడపడం వారికే చెల్లిందని కొనియాడారు. ఈ సందర్భంగా విశాఖ వెబ్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు రామకృష్ణ, గోపీనాథ్, మదన్, భాస్కర్, ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ తమ వెబ్ ఛానల్ జర్నలిస్టులకు ఎల్లవేళలా ఆపద్బాంధవుడిగా ఉంటున్న గంట్ల శ్రీనుబాబు కు ధన్యవాదాలు తెలిపారు. తమ వెబ్ ఛానల్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు దాన గుణం ఎంతో తోడ్పాటు అందిస్తోందని కొనియాడారు. గంట్ల శ్రీను బాబు మును ముందు ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి జర్నలిస్టుల ఖ్యాతిని ఇనుమడింప చేయాలని వారు కోరారు.