ఒమిక్రాన్ వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..


Ens Balu
5
Kakinada
2021-12-30 14:27:07

కోవిడ్ ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ చర్యలు తిసుకోవాలని కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి ఎజి. చిన్నికృష్ణ తెలిపారు.  గురువారం సాయంత్రం కాకినాడ రెవిన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఆర్డీవో ఎజి చిన్నికృష్ణ..డీఎస్పీ వి. భీమరావుతో  కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, యస్పీ ఆదేశాల ప్రకారం డివిజన్ స్థాయిలో ఒమిక్రాన్ పట్ల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. ఒమిక్రాన్ వేరియెంట్ రూపంలో క్రొత్త ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపద్యంలో  ఈ నెల 31వ తేదీ రాత్రి, 2022 జనవరి1న నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంటివద్దనే ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో జనం గుమికూడటం, ప్రధానంగా యువత రాత్రివేళ రోడ్ల కూడలి మధ్య ఉత్సవాలు నిర్వహించడానికి వీలు లేదన్నారు. అదేవిధంగా సముద్రతీర ప్రాంతంలో బైక్ రేస్ లు ఇతర పార్టీలు నిషేధించడం జరిగిందని ఆయన తెలిపారు.  ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. బయటకు వెళ్ళేటప్పండు విధిగా మాస్కులు ధరించడడం, భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో త్రీటౌన్ సీఐ వి.కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.