ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను వేగంగా పరిష్కరించాలి


Ens Balu
7
Visakhapatnam
2021-12-30 14:30:44

విశాఖ జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ జాతులపై జరిగే దాడులు అత్యాచార కేసులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ యాక్ట్  జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి నేరాలలో నిందితులకు కఠిన శిక్ష విధించేలా తగు ఆధారాలను సేకరించి కోర్టులో ప్రవేశ పెట్టాలన్నారు. పెండింగ్ కేసులపై ఆయన స్పందిస్తూ సాంకేతిక పరమైన కారణాలను రెవెన్యూ, పోలీస్, సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలపై జరిగిన అత్యాచార కేసులో వివిధ కేటగిరీల కింద  నమోదు చేసిన కేసులను వాటి పురోగతిని విశాఖ అర్బన్ రూరల్ జిల్లా పోలీసులు కలెక్టర్ కువివరించారు. కేసులపై పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించాలని, అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలను అనుసరించి నేరస్తులకు తగిన శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  విశాఖ కమిషనరేట్ పరిధిలో యుఐ కేసులు 123 ఉండగా పిటి కేసులు 578 వరకు పెండింగ్ ఉన్నాయని, అయితే వీటిలో ఎక్కువగా దీర్ఘకాలంగా ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు చెందిన కేసులు విచారణ పూర్తయితే క్లోజింగ్ దశలో వున్నాయిని పోలీస్ అధికారులు తెలియజేశారు. రూరల్ జిల్లా పరిధిలో 67 యుఐ కేసులు 229 పిటీ కేసులు ఉన్నట్లు తెలిపారు

జిల్లాలో  పౌర హక్కుల దినోత్సవాలను తరచుగా నిర్వహించి ఎస్.సి. ఎస్.టి. పౌరులకు వారి హక్కులను గురించి తెలియజేయాలని సూచించగా జిల్లాలో సివిల్ రైట్స్ డే లను నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు కలెక్టరుకు తెలిపారు.  దీనిపై కలెక్టరు వారిని అభినందించారు. సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డి వి రమణ మూర్తి మాట్లాడుతూ 169 కేసులలో  208 మంది ఎస్సీ ఎస్టీ బాధితుల కు రూ. 2 కోట్ల 96 లక్షల 20 వేలు నష్ట పరిహారం అందజేసినట్లు చెప్పారు.  సంఘ సభ్యులు  పెందుర్తి మండలంలో నరవ గ్రామ పరిధిలో ఎస్.టి.లకు కేటాయించిన ఇండ్ల స్థలాలుకొన్ని ఇతరుల ఆక్రమణలో వున్నాయని సూచించగా దీనిపై జాయింట్ యాక్షన్ కమిటీని వేస్తామని తెలిపారు.  ఆనందపురం మండలంలో కొంత మంది ఎస్.సి. రైతులకు  రైతు భరోసా అందడం లేదని తెలుపగా దీనిపై ఆర్డీవో, వ్యవసాయ శాఖ జెడి లను విచారణ చేయవలసినదిగా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్.పి.  బి.కృష్ణారావు, జె.సి.లు యం. వేణు గోపాలరావు, పి.అరుణ్ బాబు, డి.సి.పి. ఎస్. గౌతమి, డిఆర్వో శ్రీనివాసమూర్తి,  ఎ.ఎస్.పి.లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.