సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం..
Ens Balu
12
Visakhapatnam
2021-12-31 07:49:28
సమాజ ప్రగతిలో జర్నలిస్టులు నిర్వహిస్తున్న పాత్ర అత్యంత ప్రశంసనీయమని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి కొనియాడారు. శుక్రవారం ఇక్కడ సీతమ్మధార వీజెఎఫ్ వినోద వేదికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో మేయర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత మేయర్ హరివెంకటకుమారి, విఎంఆర్డీఏ ఛైర్మన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె. రాజు, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తదితరులు చేతులు మీదుగా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2022 నూతన డైరీని, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరంతా మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారని, అహోరాత్రులు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. త్వరలోనే జర్నలిస్టుల కి ఇళ్ళ స్థలాలు కేటాయించడం కాయమన్నరు విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో జర్నలిస్టులు ఒక వైపు సమాజానికి అవసరమైన మెరుగైన సేవలందిస్తూనే మరో వైప అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా శక్తివంచన లేకుండా సాహసోపేతంగా విధులు నిర్వహించారన్నారు. ప్రభుత్వపరంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అన్ని పండుగలతో పాటు విద్య, వైద్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయమన్నారు. గౌరవ అతిధులుగా హాజరైన మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఎండి గాదె శ్రీధర్ రెడ్డి, హనీగ్రూప్ ఛైర్మన్ ముక్కా ఒబుల్ రెడ్డి . మాట్లాడుతూ జర్నలిస్టుల నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వీజెఎఫ్కు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులంతా విశాఖ జిల్లా జర్నలిస్టులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీసుబాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ అందరి సహకారంతోనే అనేక కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నామన్నారు. నిరంతరం వైద్యానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తమ పాలకవర్గం హయాంలో సభ్యులు సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేయడంతో పాటు పండుగలు, క్రీడలు ఇతర అంశాల్లో కూడా పరిధి మేరకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. సభ్యులందరూ నూతన సంవత్సరంలో మరింత ఆనందంగా ఉండాలని వీరు ఆకాంక్షించారు. భవిష్యత్తులో రెండు ప్రెస్ క్లబ్ లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అనంతరం సభ్యులకు అతిధులు చేతులు మీదుగా డైరీ, క్యాలెండర్తో కూడిన తొమ్మిది రకాల వస్తువుల కిట్లను అందజేయడం జరిగింది. వీజెఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజుపట్నాయక్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ ధియేటర్ ఆర్ట్స్ విద్యార్ధులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో వీజెఎఫ్ ఉపాధ్యక్షులు టి.నానాజీ, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కోశాధికారి పి.ఎన్.మూర్తి, కార్యవర్గ సభ్యులు దొండా గిరిబాబు, ఇరోతి ఈశ్వరరావు, ఎమ్.ఎస్.ఆర్.ప్రసాద్,ఏం.. దివాకర్.. మాధవరావు.. తదితరులు పాల్గొన్నారు.