SCRWA ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..


Ens Balu
10
Visakhapatnam
2022-01-01 10:16:17

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. విశాఖలోని ఎంవిపి, సెక్టార్-1 లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధులుగా సిటీ కనెక్ట్ ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ లంకలపల్లి ఆనందకుమార్,ఎస్సీఆర్డబ్ల్యూఏ గౌరవ సలహాదారులు నాగనబోయిన నాగేశ్వరావు హాజరయ్యారు. ముందుగా అసోసియేషన్ సభ్యులకు అతిధులు నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ సందర్బంగా లంకలపల్లి ఆనందకుమార్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జర్నలిస్టులకు చేస్తున్న సంక్షేమం అద్వితీయమని ప్రశంసించారు. మున్ముందు అసోసియేషన్ పేరిట మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని దానికి  తమ సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం నాగనబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ, పాత్రికేయుల సంక్షేమానికి ఎస్సీఆర్డబ్ల్యూఏ  చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జర్నలిస్టులకు ఉపయోగపడే విధంగా అధ్యయన,విజ్ఞాన యాత్రలను కూడా అసోసియేషన్ నిర్వహించాలని సూచించారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈఏడాది మరిన్ని కార్యక్రమాలు చేసి పలుఅసోసిషన్లకు మార్గదర్శకంగా  స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిలవాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ,  2016 నుంచి జర్నలిస్టుల సంక్షేమంతో పాటుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే జర్నలిస్టుల సమస్యలపై పోరాడడంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రత్యేకతను చాటుకుందన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమంతో పాటుగా విజ్ఞానాన్ని పెంపొందించే  కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అదే విధంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కృషి చేస్తున్నామని, జర్నలిస్టుల హక్కులను కాపాడడంలో అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అనంతరం అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ చేపట్టి, సభ్యులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.వి.ఎస్.అప్పారావు,కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్ ,ముఖ్య సలహాదారులు కర్రి సత్యనారాయణ, నక్కాన అజయ్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్,పద్మజ,కార్యనిర్వహ కార్యదర్శి రిషి కేష్, విజయ్,సహాయ కార్యదర్సులు అబ్బిరెడ్డి చంద్ర శేఖర్,బాలు పాత్రో, ఆదినారాయణ,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.