బొలిశెట్టిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాల్సిందే..
Ens Balu
2
Visakhapatnam
2020-09-15 13:19:53
పాయకరావుపేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖజిల్లా దళిత సంఘాల సమాఖ్య వేదిక కన్వీనర్ డా.బూసి వెంటకరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విశా ఖలో మీడియాతో మాట్లాడుతూ, దళిత ఎమ్మెల్యే అయిన బాబూరావుపై ఒక మాజీ ఎంపీటీసీ ఇష్టానుసారం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఆ వ్యాఖ్యలను ఐక్యవేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే బొలిశెట్టి గోవిందరావుపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాకుండా ప్రోటోకా ల్ పాటించకుండా ఎమ్మెల్యేపై కులపెత్తనం చేయడం దారుణమన్నారు. ఇలాంటి వైఎస్సార్సీపీ నాయకులపై అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ వ్యవహారాలుంటే ఆవిధంగా చూసుకోవాలి తప్పితే దళితుడనే చిన్నచూపుతో, పార్టీ కార్యకర్తల ముందు పరువుతీసినట్టుగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. అధికాపార్టీ దళిత ఎమ్మెల్యేపై చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అంభేత్కర్ వారసులంతా ముక్త కంఠంతో ఖండించాలని, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసు కునేలా కేసు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ఇలా వదిలేస్తే రేపు మంత్రులు, ఆ పై ఎంపీలు ఇలా ఎవరినైనా ఇదే తరహాలో మాట్లాడేందుకు అవ కాశం వుంటుందని అన్నారు. దళితులంతా ఒక్కటేనని విషయాన్ని ప్రభుత్వాలకు తెలిసేలా చేయాలన్నారు. కార్యక్రమంలో సమాఖ్య కో కన్వీనర్ చింతాడ సూర్యం, బహుజన సేన కార్యదర్శి కొమ్మువీర్రాజు, కో కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, జి.రాంబాబు, సుధాకర్, మునపర్తి తదితరులు పాల్గొన్నారు.