సంక్రాంతి పండుగ దినాలను పురుష్కరించుకొని దక్షణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం కాకినాడలో దక్షణ మధ్య రైల్వే ప్రాంతీయ కార్యాలయం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. కాచిగూడ-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-విశాఖపట్నం, విశాఖపట్నం-సికింద్రాబాద్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. ఈనెల 12 13 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని, ఈ ప్రత్యేక రైళ్లు రాజమండ్రి, సామర్లకోట లలో ఆగుతాయని కూడా రైల్వే అధికారులు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.