పరమపవిత్రం సింహాచల అప్పన్న ఉత్తర ద్వార దర్శనం..


Ens Balu
13
Simhachalam
2022-01-12 07:36:48

విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఉత్తర ద్వారం లో కొలువున్న శ్రీ మహా విష్ణువు ను ఏకాదశి రోజు దర్శించుకుంటే  సాక్షాత్తు వైకుంఠంలో కొలువైవున్న శ్రీమన్నారాయనుడుని  దర్శించు కున్నంత పుణ్య ఫలం కలుగుతుందని శ్రీనుబాబు వివరించారు. ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఆ శ్రీ మన్నారాయనుడును అదే రోజున దర్శించుకున్నారు అని  
పురాణ ఇతిహాసాలు కథనం ఉందన్నారు.. బుదవారం ఉదయము సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న గంట్ల శ్రీనుబాబు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతియేటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే   ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ వర్గాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు.. ఉదయము 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా ఉత్తర ద్వార దర్శనం లభిస్తుందన్నారు.  సర్వదర్శనం తో పాటు వంద, 300, టికెట్స్ తోపాటు రూ. 500 టిక్కెట్ పై   ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా సింహగిరి  పై జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఉదయం ధర్మకర్తల మండలి సభ్యులు దినేష్ రాజ్, సూరిశెట్టి సూరిబాబు ,దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పరిశీలించారు. సింహగిరి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారని ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు, అధికారులను వీరు ప్రసంసించారు. ఆలయ ఈవోఎంవి సూర్య కళ ఆధ్వర్యంలో ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు.