ఉత్తరద్వారం లో కొలువైన శ్రీ సింహాద్రి అప్పన్నకు గంట్ల పూజలు..
Ens Balu
13
Simhachalam
2022-01-13 15:47:13
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గురువారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు కు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. తొలుత సర్వాభరనాలతోస్వామిని చూడముచ్చటగా వైకుంఠనాథుడు అలంకరణగా గావించి తదుపరి స్వామిని ఉత్తర ద్వారంలో ఆశీనులను చేశారు.. వేదమంత్రోచ్ఛారణల మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ కొలువై ఉన్న స్వామిని పలువురు భక్తులు దర్శించుకున్నారు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు. జాతీయ జర్నలిస్టుల సంఘము కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొని స్వామిని పూజించి సేవించారు. కొండ దిగువన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. అక్కడ కూడా శ్రీను బాబు దంపతులు స్వామిని సేవించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్టు బోర్డు సభ్యులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.