సింహగిరిపై వైభవంగా కనుమ పండుగ..


Ens Balu
6
Simhachalam
2022-01-16 09:10:15

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం కనుమ పండుగ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.  తెల్లవారుజామున సింహాద్రినాధుడు, శ్రీదేవి ,భూదేవి అమ్మవార్లును  సుప్రభాతసేవతో మేల్కొలిపి, ఆరాధన గావించారు. అనంతరం గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కనుమ పండుగ నేపథ్యంలో సింహాచలం గోశాలలో గోపూజ ఘనంగా నిర్వహించినట్టు  అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు,జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. సింహాద్రి నాధుడుని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా  ఆలయంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లోపాల్గొన్నారు. ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ,  ట్రస్ట్ బోర్డు సభ్యులు రాగాల నరసింహనాయుడు పలువురు అధికారులు సభ్యులు పాల్గొని గోశాలలో గోపూజలు  ఘనంగా  జరిపించారు. సింహగిరిపై మకరవేట ఉత్సవం అత్యంత సాంప్రదాయబద్దంగా నిర్వహించారన్నారు.  ఉత్సవంలో భాగంగా సింహాద్రినాధుడు కి  శ్రీమహావిష్ణువుఅలంకరణ గావించినట్లు తెలిపారు. మొసలి బారిన పడిన గజేంద్రుడిని శ్రీమహావిష్ణువు అలంకరణలో ఉన్న సింహాద్రినాధుడు  రక్షించడమే ఉత్సవము ప్రత్యేకత ఆని శ్రీనుబాబు వివరించారు. అందుకు తగ్గట్లుగానే ఆలయ వర్గాలు ఈ ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా కన్నులపండుగగా జరిపించారన్నారు. ప్రతియేటా నిర్వహించే ఈ ఉత్సవం కోవిడ్ కారణంగా కొండపైన ఆలయం వెనుక ఉన్న నీటి కొలనులో వైభవంగా జరిపించారన్నారు.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా  ఈఓఆధ్వర్యములోఅన్ని సదుపాయాలు కల్పించారు.