తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 23వేల 534 మందికి బూస్టర్ కోవిడ్ టీకా వేసినట్టు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డా.భరతలక్ష్మి తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బూస్టర్ డోసు వేస్తున్నామన్నారు. కోవిడ్ కేసులు రోజు రోజు కి పెరుగుతున్నందున జిల్లా వాసులు వైరస్ భారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. భౌతిక ధూరం పాటిస్తూ తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. ఎవరికి కోవిడ్ లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవలన్నరు. ప్రభుత్వం సూచించిన కోవిడ్ నియమాలు పాటిస్తూ, కోవిడ్ టీకా వేయించుకునేందుకు స్వచ్ఛందంగా రావాలని సూచించారు. జిల్లాలో పీహెచ్సీలు, అర్భన్ పీహెచ్సీ, సిహెచ్సీలు ఇలా సుమారు 198 చోట్ల కోవిడ్ వేక్సిన్ అందుబాటులో ఉంచినిట్టు ఆమె మీడియాకి వివరించారు.