జర్నలిస్టులూ కోవిడ్ కేసుల పట్ల భద్రంగా ఉండండి..
Ens Balu
3
Visakhapatnam
2022-01-17 06:57:21
విశాఖ జిల్లాతోపాటు, మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కోవిడ్ వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మళ్లీ ఆశన్నమైందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో మళ్లీ కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున జర్నలిస్టులు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటిస్తూ, ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లతో చేతులు పరిశుభ్రం చేసుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ భారిన పడకుండా ఉండేందుకు అవకాశం వుంటుందని తెలియజేశారు. జర్నలిస్టులపైనే వారి ఇంట్లో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఆరోగ్యంగా ఉంటేనే భాహ్య ప్రపంచంలో జరిగే విషయాలను ప్రజలకు మీడియా ద్వారా చేరువ చేయగలమన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గేంత వరకూ నిబంధనలు పాటిస్తూ, అవసరం అయితే తప్పా భయటకు రావొద్దని గంట్ల శ్రీనుబాబు జర్నలిస్టులకు ఈ సందర్భంగా సూచించారు.