అనకాపల్లి వేల్పుల వీధి సంబరానికి రండి.. గంట్లకు ఉత్సవ కమిటీ ఆహ్వానం.


Ens Balu
5
Anakapalle
2022-01-17 11:38:39

విశాఖజిల్లాలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన అనకాపల్లి వేల్పుల వీధి లో ఈ నెల 22న గౌరీ పరమేశ్వరుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.ఈఉత్సవంలో  పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘము సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును కోరారు. సోమవారం ఉత్సవ కమిటీ సభ్యులు  అందరూ విశాఖలో  శ్రీనుబాబును మర్యాదపూర్వకంగా కలుసుకొని ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ వేల్పుల వీధి ఉత్సవానికి తనను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.. కొవిడ్ నేపథ్యంలో గౌరీ అమ్మవారు కృప ప్రజలందరికీ ఉండాలని శ్రీను బాబు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.