ఘోషా ఆసుపత్రిలో 200 మందికి ఆహార పొట్లాల పంపిణీ...
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
ఘోషా ఆసుపత్రి
                            2020-09-15 13:37:54
                        
                     
                    
                 
                
                    అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని విశాఖ దక్షణిణ నియోజకవర్గం బీజెపీ కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ అన్నారు. మంగళవారం విశాఖలోని గోషా ఆసుప త్రిలో రోగుల బంధువులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు 200 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ విజ్రుం భిస్తున్న సమయంలో తమవంతుగా నిరుపేదలకు సహాయం చేయాలనే ప్రధాని మోడి ఇచ్చిన పిలుపుతో తాను ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా చేపడుతు న్నట్టు చెప్పారు. ఆసుపత్రి కష్టాలతో వున్న రోగులకు తమవంతుగా చేసే ఈ చిన్న ఆహార సహాయం చేయడం ద్వారా వారికి కొద్దిగా స్వాంతన కలుగుతుందన్నారు. తాను చూపట్టే ఈ అన్నసంతర్ఫణ కార్యక్రమాల్లో బీజేపి నాయకులు, కార్యకర్తలు కూడా పాలుపంచుకుంటున్నారని అన్నారు. ఘోషా ఆసుపత్రికి నిత్యం ఎందరో నిరుపేద రోగులు వస్తారని, అందుకే తమ సేవకు ఈ ఆసుపత్రిని ఎంపిక చేసుకున్నట్టు రామ్ కుమార్ వివరించారు.