జివిఎంసీ 22వ వార్డులో ఆధార్ సేవలు ప్రారంభం..


Ens Balu
8
Visakhapatnam
2022-01-20 07:03:20

మహావిశాఖనగర పాలక సంస్థ పరిధిలోని 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియం వార్డు కార్యాలయం మేడ పైన ఉన్న 149 సచివాలయంలో  గురువారం ఆధార్ సేవలను  వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఆధార్ సేవలు అందించడానికి 149వ నెంబరు సచివాలయంలో ఆధార్ కేంద్రం మంజూరయిందని చెప్పారు. ఈ కేంద్రంలో ఆధార్ కార్డు లోని పేర్లు, చిరునామా, తప్పు ఒప్పులు సరిచేయడంతోపాటు, కొత్త ఆధార్ కార్డులు, కార్డుల్లో ఫోన్ నంబర్ నమోదు వంటి సేవలు ఉంటాయన్నారు. వార్డు ప్రజలు ఆధార్ సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ శ్రీలక్ష్మీ, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ కార్యదర్శి హరిత, భారతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.