విశాఖజిల్లాలో కరోనా నేపథ్యంలో జిల్లా అధికారులు 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. కోవిడ్ చికత్స, పరీక్షలు, సలహాలు, సంప్రదింపుల కోసం జిల్లావాసులు 104 కాల్ సెంటర్ లో 0891-2501271, 2501272 నెంబర్లలో సంప్రదించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ఇక్కడ నోడల్ ఆఫీసర్ గా 9849112471 లో సంప్రదించవచ్చు. అదేవిధంగా కోవిడ్ పరీక్షలు ఇంటి దగ్గరే చేయించుకోవాలనుకుంటే.. 8309150237, 8309875283లోనూ సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు కోరారు.