తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఒక్కరోజే 6613మందికి కోవిడ్ బూస్టర్ డోసు కోవిడ్ టీకా అందించినట్టు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.భరతలక్ష్మి తెలియజేశారు. గురువారం కాకినాడలో ఆమె మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ కోవిడ్ రెండవ డోసు టీకా 40447 మందికి అందిచామని పేర్కొన్నారు. జిల్లాలోని 64 మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, గ్రామ సచివాలయాల్లో ఆరోగ్య మిత్రాల ద్వారా కోవిడ్ టీకా వేస్తున్నట్టు ఆమె తెలియజేశారు. అదేవిధంగా 15-17 ఏళ్ల వయస్సు వన్నవారికి 390 మందికి కోవిడ్ టీకా వేసినట్టు చెప్పారు. జిల్లాలో కోవిడ్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నందున కోవిడ్ టీకా తీసుకునేందుకు ప్రజలు స్వచ్చందంగా ముందుకి రావాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.భరతలక్ష్మి మీడియా ద్వారా జిల్లా వాసులకు సూచించారు.