22వ వార్డులో రోడ్లకు మరమ్మత్తులు.. కార్పోరేటర్ పీతల మూర్తియాదవ్..


Ens Balu
5
Visakhapatnam
2022-01-22 07:48:10

విశాఖలోని జివిఎంసీ 22వ వార్డులో గుంతలు పడిన రోడ్లకు మోక్షం కలిగింది. రూ.1.20 లక్షలతో శనివారం మరమ్మత్తు పనులు చేపట్టారు. 8నెలలు కిందట వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని జీవీఎంసీ మేయర్, కమిషనర్లకు వినతి పత్రం అందించారు. ఈ మేరకు 22వ వార్డులో రోడ్డులు మరమ్మత్తులకు రూ.లక్ష 20 వేలు మంజూరు చేయగా ఆ నిధులతో పిఠాపురం కాలనీ, పీతలవాని పాలెం, సిద్దార్థ నగర్, రేసపువానిపాలెం, మంగాపురం కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్డుల మరమ్మత్తులు చేశారు.  వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దగ్గరుండి రోడ్డు పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో రోడ్లు అద్వాన్నంగా తయారయ్యాయని జీవీఎంసీ కమిషనర్ దృష్టిలో పెట్టామన్నారు. ప్రస్తుతం రోడ్ల మరమ్మత్తులకు కేటాయించిన నిధులతో పనులు చేస్తున్నామన్నారు. వార్డు సమస్యలు పరిష్కారం చేయడానికి నిరంతరం పాటు పెడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ సత్యశ్రీ .సాయి వర్క్ ఇన్స్పెక్టర్, సచివాలయ ఎమినెట్స్ కార్యదర్సులు ప్రసాద్, హేమంత్, కార్తీక్, రవితేజ, తరుణ్, సత్యకళ, సుజాత, నాయకులు సత్యం, పెసల శ్రీను, వియ్యాపు రామకృష్ణ, రవి, దేవా పాల్గొన్నారు.