కేంద్రం జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాల్సిందే.. గంట్ల శ్రీనుబాబు
Ens Balu
8
Visakhapatnam
2022-01-25 09:51:35
భారత దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం(ఎన్ ఎ జె) తరఫున మరింతగా కృషి చేస్తామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. 2వసారి జాతీయ కార్యదర్శిగా నియమింపబడ్డ తరుణంలో శ్రీనుబాబును మంగళవారం'సింహాచలంకు చెందిన పలు అసోసియేషన్ లు కు చెందిన యువత ఘనంగా సత్కరించింది. డాబాగార్డ్ న్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనుబాబు మాట్లాడుతూ, తాను ఏ పదవిలో ఉన్నా ఎటువంటి లాభాపేక్ష లేకుండా యూనియన్లు కి అతీతముగా జర్నలిస్టులందరికీ మేలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలను గుర్తించామని దశలవారీగా వాటిని పరిష్కరించేందుకు పార్లమెంట్ సబ్ కమిటీ కి కూడా నివేదిక ఇవ్వ ఇవ్వనున్నట్టు చెప్పారు. జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు చట్టాలను పునరుద్ధరించాలని కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్య క్రమంలో సింహాచలం కి చెందిన అంబేద్కర్ కాలనీ అద్యక్షులు అప్పలరాజు,కార్యదర్శి.. చంటి, బంగారు బాబు, వంగలపూడి రమణ, శంకర్, చిట్టి,శివ.. తో పాటు లండ శ్రీను, దొంతల సంతోష్, గంట్ల కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.