ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి...


Ens Balu
3
Srikakulam
2020-09-15 15:38:46

శ్రీకాకుళం జిల్లాలో ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని గా ఘనంగా నిర్వహించారు. మంగళవారం వంశధార సర్కి ల్ కార్యాలయం వద్ద ఇంజనీర్లు అందరూ విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడా రు. ఈ సందర్భంగా తోటపల్లి ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ డోలా తిరుమల రావు మాట్లాడుతూ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిరస్మరణీయుడు అన్నారు. ఆయన స్ఫూర్తి, అంకితభావంతో ఇంజినీర్లు పనిచేయాలని పిలుపునిచ్చారు. మోక్షగుండం ఆలోచనా విధానం ఇంజనీర్లకు ఎంతో ఆచరణీయమని ఆయన పేర్కొన్నారు. ఇంజినీర్లు దేశ ప్రగతిలో ముఖ్య భూమిక పోషించారని, దానిని కొనసాగించాలని కోరారు.  ప్రస్తుతం అనేక ప్రాజెక్టులు ఉన్నాయని వాటిని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క ఇంజనీరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో వంశధార ప్రాజెక్టు, తోటపల్లి ఆధునీకరణ పనులు, ఆఫ్ షోర్ ప్రాజెక్టులతో పాటు ఇతర జలవనరులను ప్రజలకు ప్రయోజనకరంగా తీర్చిదిద్ధి చిరస్మరణీయంగా ఉండాలని ఆయన కోరారు. మోక్షగుండం పనితనం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన ఎంతో నీతి నిజాయితీలతో పనిచేశారని కొనియాడారు.