జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లకు సత్కారం
Ens Balu
3
Visakhapatnam
2022-01-31 07:14:28
మహా విశాఖ అభివృద్ధిలో జర్నలిస్టులు అందించిన సహకారం మరుపురానిదని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, కమిషనర్ లక్ష్మీ శ కొనియాడారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా(ఎన్‌ఎజె) రెండో సారి నియమితులైన వైజాగ్ జర్నలిస్టుల ఫొరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబును సోమవారం నగర మేయర్, కమిషనర్‌లు ఘనంగా సన్మానించి సత్కరించారు. మేయర్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ జర్నలిస్టుల సహకారం వల్లే విశాఖ నగరం అంతర్జాతీయ స్ధాయిలో అనేక పేరు ప్రతిష్టలు, అవార్డులు సాధించగలగిందన్నారు. 2007 నుంచి జీవీఎంసీ కార్యక్రమాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు ఎన్నో సలహాలు, సూచనలు అందజేసి జీవీఎంసీ అభివృద్ధికి శ్రీనుబాబు ఎంతగానో కృషి చేశారని మేయర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల మిత్రులు అందించిన సహకారం వల్లే తాను ఆంధ్రప్రదేశ్ నుంచి వరుసుగా రెండో సారి జాతీయ జర్నలిస్టుల సంఘం(ఎన్‌ఎజె) కార్యదర్శిగా నియమితులు కావడం జరిగిందన్నారు. తాను 2007 నుంచి నేటి వరకూ జీవీఎంసీకి సంబంధించిన అనేక కథనాలు రాయడంతో పాటు, నగరాభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. 1997 నుంచి నేటి వరకూ తాను మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, 8 జాతీయ స్ధాయి అవార్డులతో పాటు, మొత్తం 29 అవార్డులను సాధించి వాటిని జర్నలిస్టుల మిత్రులకే అంకితం చేసినట్లు చెప్పారు.భవిష్యత్‌లో కూడా జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ప్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కో-ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు, అదనపు కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావుతో పాటు, వైకాపా నాయకులు గొలగాని శ్రీనివాస్ పలువురు కార్పోరేటర్లు పాల్గొని శ్రీనుబాబును అభినందించారు.