జర్నలిస్టులకు బాసటగా నిలిచిన కలెక్టర్..


Ens Balu
4
Visakhapatnam
2022-02-01 13:26:50

మహావిశాఖలోని జర్నలిస్ట్ లు వారి కుటుంబ సభ్యులకు బూస్టర్ డోస్ కోవిడ్ టీకా ప్రక్రియను 2రోజుల పాటు నిర్వహించి సహకరించినందుకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఎ)  అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జునకు ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ తరపున జర్నలిస్టుల శ్రేయస్సు దృష్ట్యా తాను చేసిన వినతికి స్పందించిన కలెక్టర్ స్పందించి జేసీ అరుణ్ బాబు చే ప్రత్యేకంగా టీకా క్యాంపు ఏర్పాటు చేయడం ముదావహం అన్నారు.  విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఎన్జీవో హోంలో  సోమవారం జర్నలిస్టులకు ప్రారంభించిన బూస్టర్ డోస్ టీకా ప్రత్యేక డ్రైవ్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా క్షేత్రంలో న్యూస్ కోసం తిరిగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు బూస్టర్ డోస్ వేక్సినేషన్ ప్రత్యేకంగా జరపడం ప్రశంసనీయం అన్నారు.  సంబంధిత సిబ్బందిని 2 రోజుల పాటు కేటాయించి అందించిన సేవలకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎస్.సి.ఆర్.డబ్ల్యూ.ఎ ) తరపున జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జేసీ అరుణ్ బాబు లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ఎం.వి.ఎస్.అప్పారావు,ఉపాధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్,పద్మజ తదితరులు పాల్గొన్నారు.