జర్నలిస్టుల సహకారంతోనే సమాజ ప్రగతి..


Ens Balu
6
Visakhapatnam
2022-02-03 05:34:03

జర్నలిస్టుల సహకారంతోనే సమాజ ప్రగతి సాధ్యమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. గురువారం సింహాచలం గ్రామానికి చెందిన పలువురు శ్రీనుబాబును అక్కయ్యపాలెం కార్యాలయంలో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలం ప్రాంతానికి చెందిన తాను అందరి సహకారంతో అంచలంచెలుగా రాష్ట్ర, జాతీయ స్థాయి జర్నలిస్టుల సంఘాల నాయకుడిగా అనేక పదవులు చేపట్టడం జరిగిందన్నారు. తాను ప్రారంభం నుంచి తన పరిధి మేరకు జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా అదే రీతిన తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అడవివరం, సింహాచలం పరిసర గ్రామాల్లో కూడా తన వంతు సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. శ్రీనుబాబును సత్కరించిన వారిలో బంటుబిల్లి శివాజీ, సంతోష్, యడ్ల శ్రీను, జి.సీతారాం, ఎస్.ప్రవీణ్, దీపక్, చరణ్, అప్పారావు, వరంబాబు తదితరులు ఉన్నారు. వీరందరూ శ్రీనుబాబును ఘనంగా సత్కరించి సింహాద్రినాధుడిజ్ఞాపికను అందజేశారు.