వన్ టైం సెటిల్ మెంట్ లబ్ధిదారులకు వరం


Ens Balu
6
Anantapur
2022-02-04 08:22:44

వన్ టైం సెటిల్ మెంట్  పథకం లబ్ధిదారులకు వరమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వన్ టైం సెటిల్ మెంట్  లబ్ధిదారులకు సర్వ హక్కులు కల్పించే రిజిస్టర్ పత్రాలు పంపిణీ కార్యక్రమం  నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ వసీం,డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,  కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు  పథకం ద్వారా పేద ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.గతంలో ఇళ్లు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి ఉండటమే కాకుండా కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి గతంలో మనం చూశామన్నారు.వన్ టైం సెటిల్ మెంట్ వల్ల ఆ ఇబ్బందులు అన్ని తొలగి పోతాయని ప్రజలకు మేలు చేయాలన్నది సి ఎం జగనన్న సంకల్పంమని పేర్కొన్నారు.వన్ టైం సెటిల్ మెంట్ పై ప్రతిపక్ష పార్టీలు అనేక కుట్రలకు పాల్పడినా వారి మాటలను నమ్మకుండా సద్వినియోగం చేసుకున్న లబ్ధిదారులందరికీ మేయర్ కృతజ్ఞతలు తెలియచేశారు.వన్ టైం సెటిల్ మెంట్ పూర్తి స్వచ్చందం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించారని మేయర్ గుర్తు చేశారు.నేడు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కృషితో  నగరం అన్ని విధాలా వేగవంతం గా అభిరుద్ది చెందుతోందని,నగర రూపురేఖలు మారేలా రోడ్ల అభిరుద్ది జరుగుతున్న తీరును మీరంతా చూస్తున్నారన్నారు.ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేస్తున్న అభిరుద్దిని ఓర్వలేక టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని వారి కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు.నగర ప్రజలందరి సహకారంతో నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ స్పష్టం చేశారు.కార్యక్రమంలో అదనపు కమీషనర్ రమణ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ సావిత్రి,కార్పొరేటర్లు అనిల్ కుమార్ రెడ్డి, సైఫుల్లా బెగ్ , చంద్ర లేఖ, సుజాతమ్మ, లాలు, కమల్ బూషన్, శ్రీనివాసులు, సంపంగి రామాంజనేయులు, టీపీఓ జ్యోతి ,నాయకులు రామచంద్ర, కుళ్ళాయి స్వామి, రవి,రాధ కృష్ణ, దాదు  , మెప్మా సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.