విశాఖ నగర పాలన జీవిదా జీవీఎంసీదా..జనసేన


Ens Balu
3
Visakhapatnam
2022-02-07 07:43:55

మహా విశాఖ నగరాన్ని పాలిస్తున్నది నగరపాలక సంస్థా లేక విశాఖ స్మార్ట్ సిటీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి తెచ్చుకున్న జి. వెంకటేశ్వరరావో అన్నది కౌన్సిల్ సభ్యులతో పాటు నగర ప్రజలకు అర్ధం కావడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎద్దేవా చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జీవి కౌన్సిల్ ప్రమేయం లేకుండా  కొత్త ప్రాజెక్టులను ప్రకటించడం, నిర్ణయాలు తీసుకోవడం పై స్పష్టత ఇవ్వాలని కోరుతూ సోమవారం స్పందనలో జీవీఎంసీ మేయర్, కమిసనర్లకు ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జీవీఎంసీ కౌన్సిల్ తో  సంబంధం లేకుండా ఇటీవల వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రకటించిందన్నారు. 98 మంది కార్పొరేటర్ల తో ఎన్నికైన కౌన్సిల్, మేయర్, డిప్యూటీ మేయర్ లను పక్కనపెట్టి వారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఈ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వర్ రావు ప్రాజెక్టులను ఏకపక్షంగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. మాధవధార నుంచి ముడసర్లోవ వరకు ఒకటిన్నర కిలోమీటర్ల మేర సింహాచలం కొండ కు సొరంగ మార్గం, 20 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఎకరాల విస్తీర్ణంలో స్నో పార్క్, జగదాంబ వద్ద  నిర్మించిన మల్టీ లెవల్ పార్కింగ్  ఫీజులు ఖరారు  వంటివన్నీ కౌన్సిల్  ప్రమేయం లేకుండా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించడం పై విస్మయం వ్యక్తం చేశారు. అలా ప్రకటించే హక్కు అధికారం ఆయనకు ఎలా వచ్చాయో  తెలియడం లేదన్నారు.  2015 ఏర్పాటయిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ గడువు  కరోనా కారణంగా రెండేళ్ల పొడిగించారని, 2022 మార్చి తో స్మార్ట్ సిటీ ముగుస్తుందన్నారు. నెల రోజుల్లో ఇంటికి వెళ్లిపోయే వ్యక్తి  జీవీఎంసీ మేయర్, కమిషనర్ లా ప్రాజెక్టులపై సమీక్షలు చేయడం వాటికి అధికారులు హాజరవడం చూస్తుంటే షాడో పాలనలా కనిపిస్తుందని ఆక్షేపించారు. నగరంలో  గుర్తించిన, ప్రజలు అంగీకరించిన 1700 ఎకరాల లోనే ఈ కార్పొరేషన్ కు కార్యకలాపాలు చేసేందుకే అధికారం ఉందన్నారు. సుమారు మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు.  మరో రెండు నెలల్లో గడువు ముగిసే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ వందల కోట్ల రూపాయల రక రకాల కొత్త ప్రాజెక్టులను  ఏకపక్షంగా ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. విశాఖ నగర ప్రజల అవసరాలు తెలుసుకుని కార్పోరేషన్  దృష్టికి తీసుకువెళ్లి కౌన్సిల్ తీర్మానం ద్వారా చేపట్టాల్సిన పనులను స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఒకే వ్యక్తి ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.  ఈ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 162  కోట్ల రూపాయలు సీఎఫ్ఎంఎస్ వద్ద   పెండింగ్లో ఉండటంతో ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదన్నారు. వాటిపై దృష్టి సారించి నిధులు రాబట్టే పనులు పూర్తి చేయాల్సిన స్మార్ట్  సిటీ కార్పొరేషన్ చైర్మన్ అందుకు విరుద్ధంగా కౌన్సిల్ తో సంబంధం లేకుండా ఊహాజనితమైన ప్రాజెక్టుల ప్రకటించుకుంటూ పోవటం కార్పొరేటర్లను,కౌన్సిల్ ను అవమానించడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారాలపై మేయర్ కూడా స్పందించకపోవడం  ఆందోళన కలిగిస్తుందన్నారు. జివిఎంసి కమిషనర్ హోదాలో స్మార్ట్ సిటీ సీఈవో గా  కూడా కమిషనర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు సమీక్షలకు హాజరైనట్లు పత్రికల్లో వార్తలు రావడం విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు. కాలపరిమితి ముగిసిన , నిధులు లేని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా నిజంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సాధ్యం  అవుతుందా లేదా అన్నది స్పష్టం చేయాల్సిందిగా కోరారు. స్మార్ట్ సిటీ పేరిట చేపట్టిన ప్రాజెక్టుల్లో  వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న  ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇటీవల  పిలిచిన కేబుల్  టెండర్లలో అక్రమాలు జరిగినట్టు స్వయంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసి దాన్ని ఆపాల్సిందిగా కోరారని చెప్పారు. మిగిలిన ప్రాజెక్టులపై సమీక్ష జరిపి స్మార్ట్ సిటీ వ్యవహారాలపై పూర్తి వివరాలతో కూడిన  నివేదిక ను కార్పొరేటర్ లకు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ సిటీ వ్యవహారాలపై చర్చించేందుకు వచ్చే కౌన్సిల్ ఎజెండాలో ఈ ప్రాజెక్టుల వారీగా అన్ని  అంశాలను చేర్చాల్చిందిగా కోరారు.. 960 కోట్ల రూపాయలతో నరవలో  జరుగుతున్న  సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ పై సమగ్ర వివరాలను అందజేయాలని కోరారు. ఇందులో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులు 100 కోట్లు కాగా నగర పాలక  సంస్థ ఎనిమిది వందల కోట్లకు పైగా నిధులు సమకూర్చుతుందన్నారు. నగరపాలక సంస్థ ఆస్తులను తాకట్టు  పెట్టి మరి  ఇందుకోసం అప్పులు  చేస్తున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ వందల కోట్లను ఖర్చు చేస్తూ నిర్వహణను స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అప్పగించడం హాస్యాస్పదంగా ఉందన్నారు . ఈ అంశాన్ని జీవీఎంసీ మేయర్, కమిషనర్లు    సమీక్షించడమే కాకుండా కౌన్సిల్ సమావేశం లో చర్చించాలని డిమాండ్  చేశారు.