అర్జీలు పరిష్కారంలో నాణ్యత ఉండాలి..


Ens Balu
4
Visakhapatnam
2022-02-07 11:41:20

స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో   జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబులతో ఆయన స్పందన కార్యక్రమం, సచివాలయ సిబ్బంది సర్వీసు రెగ్యులరైజ్ లపై ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందనకు వచ్చే దరఖాస్తులు ఏ శాఖ వద్ద పెండింగ్ లో ఉంచరాదన్నారు.  స్పందన అర్జీలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పెండింగ్ లో లేకుండా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అర్జీలు పై సమీక్షించి  పెండింగ్ కు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుకొని, అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అర్జీలు పరిష్కారంలో నాణ్యత ఉండాలని, పరిష్కరించే అర్జీలు నాణ్యత లోపిస్తే అలాంటి అర్జీలు పునరావృత్తం అవుతాయన్నారు. గ్రామ /వార్డు సచివాలయ సిబ్బింది సర్వస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రతిపాదనలు వెంటనే పంపాలని ఆదేశించారు.