విశాఖలో ఆందోళన బాటలో ఓలా, ఊబర్ డ్రైవర్లు..


Ens Balu
7
Visakhapatnam
2022-02-08 08:43:35

మహా విశాఖ నగరంలో ఆన్ లైన్ ప్రైవేటు ట్రావెల్స్.. ఓలా, ఉబర్ కారు డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ఆందోళనకు దిగారు. నగరంలోని గురుద్వారా, మర్రిపాలెంలలో గల ఓలా, ఊబర్  కార్యాలయాలకు ప్రదర్శనగా వెళ్లి స్థానిక ప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. డ్రైవర్ నుంచి యాజమాన్యం తీసుకుంటున్న కమిషన్ తగ్గించాలని,  ట్రిప్  రేట్లు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. సిఐటియు కార్మిక సంఘానికి అనుబంధంగా ఉన్న ఓలా, ఊబర్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పతివాడ రాములు  ఆధ్వర్యంలో సుమారు వందమంది డ్రైవర్లు ఆందోళనలో పాల్గొన్నారు. యూనియన్ ప్రతినిధులు  నాయుడు, నాని, మాధుసూధన్, గోపి కృష్ణ, సుధీర్ తదితరులు హాజరయ్యారు.