భజన బృందం సేవలు ప్రశంసనీయం.. గంట్ల


Ens Balu
12
Kancharapalem
2022-02-08 09:48:08

దేవాలయానికి వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తి భావం నింపేందుకు భజన మండలిలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సింహాచలం దేవస్ధానం  ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. మంగళవారం విశాఖ కంచరపాలెం సమీపంలో ఉన్న మధుసూదన్ నగర్ దుర్గాదేవి ఆలయంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా 2వసారి నియమితులైన గంట్ల శ్రీనుబాబు ను స్థానిక వైభవ వెంకటేశ్వర కోలాటం భజన మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ ఇక్కడ దేవస్థానంతో పాటు అన్ని దేవాలయాల్లోనూ ఈ భజన మండలి  తమ ప్రదర్శనలతో భక్తులను విశేషంగా అలరిస్తోంది అన్నారు..మరోవైపు  స్వామి, అమ్మవారులుని కూడా ఘనంగా కీర్తించడం అభినందనీయమన్నారు. ఆన్ని. భజన మండలలుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత   ఆయా  దేవాలయాల పైనే ఉందన్నారు. వైభవ వెంకటేశ్వర కోలాటం భజన మండలి అనేక ప్రదర్శనలు ఇచ్చి నగర ప్రజలను విశేషంగా అలరిస్తుందన్నారు.  ఈ భజన మండలి కి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని శ్రీనుబాబు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీనుబాబు ను వీరంతా ఘనంగా సన్మానించి సత్కరించారు..శ్రీ వైభవ వెంకటేశ్వర కోలాటం భజన మండలిఅధ్యక్షురాలు చిక్కాల గీతా కుమారి, కార్యదర్శి ఇరోతి శశి, కోశాధికారి మళ్ల జ్యోతి, సభ్యులు సేనాపతి మంగ, రేవతి, వెంకటలక్ష్మి,సరళ,లోవ, సత్య, సుబద్ర, తదితరులు పాల్గొన్నారు.