మహా విశాఖ నగర పరిధిలోని 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తన సొంత నిధులతో స్టేషనరీ కొనుగోలు చేసి గురువారం వార్డు లోని 7 సచివాలయాలకు పంపిణీ చేశారు. 7 సచివాలయాలకు అవసరమైన పేపర్ బండిల్స్, ప్రింటర్ సిరా బాటిల్స్, పెన్నులు, స్టేపలర్స్, మార్కార్స్, కత్తెరలు కొనుగోలు చేసి పిఠాపురం కాలనీ కళాభారతి పక్కన వార్డు కార్యాలయంలో సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు సచివాలయాలు అందిస్తున్న సేవలకు అంతరాయం కలగకుండా స్టేషనరీ అందించామన్నారు. వార్డు కార్పొరేటర్ గా విజయం సాధించిన అనంతరం ప్రజలకు సచవాలయాల్లో సేవలు ఆగకుండా ఉండేందుకు అవసరమైన స్టేషనరీ అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఈ స్టేషనరీ అందిస్తున్నామని చెప్పారు. అలాగే పదవిలో కొనసాగినంత కాలం కూడా సచవాలయాలకి తన సొంత నిధులులతో స్టేషనరీ అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల కార్యదర్శిలు శ్రీలక్ష్మి, హరిత, చిరంజీవి, సంపత్, వెంకటేష్, రాఘవేంద్ర, ఝాన్సీ, సాయి చరణ్ పాల్గొన్నారు.