గంట్లకు బీసీ సంఘం నేతల ఘన సత్కారం..
Ens Balu
6
Visakhapatnam
2022-02-10 14:46:34
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా రెండోసారి నియమితులైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును బీసీ సంఘం నేతలంతా ఘనంగా సన్మానించి సత్కరించారు. తాము చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని శ్రీనుబాబును వీరంతా కోరారు. బీసీ వర్గానికి చెందిన తాను ఎప్పుడూ సంఘం సభ్యులకు అందుబాటులో ఉంటానని శ్రీనుబాబు చెప్పారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన సభ్యులందరికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో వైద్యులు సలహా మేరకు సంఘం సభ్యుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు సంఘం నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దేవగుప్త రమేష్, అధికార ప్రతినిధి ఎమ్మెస్సార్ ప్రసాద్,ఇతర నేతలు పొన్నాడ మోహనరావు, చిత్రాడ అప్పారావు, ఎన్.రవికుమార్, కనకమహాలక్ష్మి, అనసూయ, ప్రమీల, భారతి, సుశీల తదితర సభ్యులంతా పాల్గొన్నారు.