ఆ18 కులాలకు జగనన్న చేయూత అందించాలి..


Ens Balu
8
Visakhapatnam
2022-02-10 14:47:54

రాష్ట్రవ్యాప్తంగా జగనన్న చేయూత ద్వారా రజక, నాయిబ్రాహ్మణ, దర్జీలకు సుమారు రూ.285 కోట్లు అందించడం అభినందనీయమని విశాఖ జిల్లా బిసీ సమైఖ్య సంఘం అధ్యక్షులు పెబ్బిలి రవికుమార్ అన్నారు. గురువారం ఇక్కడ సీతమ్మధార సంఘం కార్యాలయంలో రవికుమార్ అధ్యక్షతన బీసీ కులాల సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు, బీసీ నాయకులు తుమ్మిడి రామకుమార్ తో కలిసి రవికుమార్ సభ్యులనుద్దేశించి మాట్లాడారు. అయితే వివిధ రకాల కులవృత్తులు చేసుకుంటున్న 18 బిసి కులాలను కూడా జగనన్న చేయూత ద్వారా లబ్ధి చేకూర్చాలని తాము ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. దీంతో పాటు 56 బీసీ కార్పొరేషన్లు ద్వారా అందజేస్తున్న రూ.2 లక్షల రూపాయలు రుణంలోనూ ఒకలక్ష సబ్సిడీ ఇచ్చే విధంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం ద్వారా నివేదించడం జరుగుతుందన్నారు. బీసీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, త్వరలో బీసీలకు మేలు చేసే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీసీల ప్రధాన సమస్యలను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన పరిష్కారం కోరుతామన్నారు.