హిందీ పరీక్షలకు దరఖాస్తు గడువు 25..


Ens Balu
2
Bheemunipatnam
2020-09-15 20:09:10

దక్షిణ భారత హిందీ ప్రచారసభ చెన్నై నిర్వహించే వివిధ హిందీ పరీక్షలకు సమయం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కేంద్రాలకు వర్తమానం పంపిం ది. ఆశక్తిగల అభ్యర్ధులు  పది రూపాయలు అపరాధ రుసుతో ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చని భీముని పట్నంలోని స్థానిక ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షుడు కేఎస్‌ఆర్‌ ‌కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందీ ప్రచారసభ పరీక్షలకు గడుపు పూర్తికాగా, అభ్యర్ధుల నుంచి వస్తున్నఅభ్యర్ధన మేరకు 25వ తేదీవరకూ గడువు పొడిగింపు ప్రకటన చేసిందన్నారు. పరీక్షలు కట్టిన విద్యార్ధులకు ఈనెల 31, నవబర్‌ 1‌వ తేదీల్లో స్థానిక పండిత్‌నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాల కేద్రంగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆశక్తివున్న అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పరీక్షఫీజులు, ధరఖాస్తులు ఇతర వివరాలకు 8985647419లోగానీ స్వయంగా గానీ సప్రదించాలని నిర్వాహకులు కోరారు.
సిఫార్సు