వాస్తవాలు అదించడంలో ‘సాక్ష్యం టీవి’ దిట్ట..


Ens Balu
6
Visakhapatnam
2022-02-16 14:40:17

వాస్తవాలను మంచి వార్తలుగా అందించడంలో సాక్ష్యం టీవి ప్రజలమన్ననలు పొందిందని విశాఖ ఎంపీ ఎంవివి సత్యన్నారాయణ అన్నారు. విశాఖలోని బుధవారం సాక్ష్యం టెలివిజన్ 2022 డైరీ ఎంపీ  ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, 2018లో మొదలైన సాక్ష్యం ఛానల్ మంచి వార్తలను, వాస్తవాలను,ప్రసారం చేస్తూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం అబినందనీయమన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజల సమస్యలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ అభివ్రుద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు చేరువ చేయాలన్నారు.   ఏ.పి నాగవంశం కార్పొరేషన్ చైర్ పర్సన్ బొడ్డు అప్పల కొండమ్మ, మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వడమే కాకుండా, నాణ్యమైన ప్రసారాలను అందించడంలో సాక్ష్యం టెలివిజన్ ముందుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం టీవీ ఎండీ మెకర శ్రీనివాస్ ను అభినందించారు. సీఈఓ డాక్టర్ కంటుభుక్త శ్రీనివాస్, డైరెక్టర్ యం.కనకరాజు, సీనియర్ జర్నలిస్టు డిజె మోహన్ కుమార్, ఏ.పి నాగ వంశం కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు అప్పల కొండమ్మ కలిసి యం.పి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.