భోగి గణపతికి సంకష్టహరచతుర్ధి నీరాజనాలు..
Ens Balu
4
Kakinada
2022-02-20 08:35:47
ద్విజప్రియ సంకష్ఠహరచతుర్ధి సందర్భంగా కాకినాసూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభు శ్రీభోగిగణపతిపీఠం లో ఆదివారం ఉదయంగణేశ సహస్ర నామ పారాయణ ఘనంగా నిర్వహించారు. గణపతి ఆరాధకులు స్వయంసేవగా తెల్లజిల్లేడు పుష్పాలు ఉండ్రాళ్ళు నారికేళాల సమర్పణతో ధూప దీప నీరాజన మంత్రపుష్ప పూజాధికాలు నిర్వహించుకుని తీర్థ నైవేద్య ప్రసాదాలు పంపిణీ చేశారు. సంప్రోక్షణ అనంతరం పీఠంలో స్వయంభువుకి స్వయంసేవలు జరుగుతున్నాయని పీఠం ఉపాసకులు రమణరాజు తెలిపారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిచారు. పీఠం ఆధ్వర్యంలో భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేశారు.