అప్పన్న ప్రహ్లాద మండపం కాళీ చేయిస్తాం..


Ens Balu
10
Visakhapatnam
2022-02-22 08:31:29

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణ మండ పం త్వరలోనే దేవస్థానం కు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎంపి వి.విజయ సాయిరెడ్డి  తెలిపారు. ఈ కళ్యాణ మండపం తక్షణము  అప్పగించాలని కోరుతూ అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మంగళ వారం కోరారు. రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంఛార్జి  వి.విజయసాయి రెడ్డిని  సీతమ్మదార క్యాంపు కార్యాలయంలో కలుసుకొని ఇందుకు సంబంధించిన వివరాలతో శ్రీనుబాబు వినతిపత్రం సమర్పించారు. 2013లో అప్పటి దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో కేవలం ఆరు నెలల కాలానికి సిఆర్పిఎఫ్ కి అద్దె ప్రాతి పదికిన  కేటాయించారన్నారు. అయితే నాటి నుంచి నేటి వరకు సుమారు తొమ్మిదేళ్లపాటు సిఆర్పిఎఫ్  జగదాంబ జంక్షన్ లో ఉన్న ఈప్రహ్లాద మండపాన్ని తన ఆధీనంలో ఉంచుకుని కనీసం అద్దె బకాయిలు  కూడా చెల్లించలేదని ఎంపీకి శ్రీనుబాబు వివరించారు. సుమారు ఆరున్నర కోట్లు అద్దె బకాయిలు సిఆర్పిఎఫ్ నించి  సింహాచలం దేవస్థానం కు చెల్లించాల్సి ఉందన్నారు. కరోనా లో సైతం సింహాచలం దేవస్థానం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొందని  అయినప్పటికీ ఎన్నిసార్లు లేఖలు రాసిన సిఆర్పిఎఫ్ నుంచి స్పందన కానరావడం లేదని ఎంపి కి తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తోపాటు విజయసాయిరెడ్డికి  కూడా తెలియజేసినట్లు శ్రీనుబాబు  తెలిపారు. నగరంలో సింహాచలం దేవస్థానం కు ఉన్న ఏకైక ఆస్తి ఈ భవనం మాత్రమేనని ఇది కూడా చాలా ఏళ్లుగా సిఆర్పిఎఫ్ ఆధీనంలో ఉండిపోవడము వల్ల  భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఎంపి కి వివరించారు.అయితే తాము సిఆర్పిఎఫ్ కు వ్యతిరేకం కాదని కానీ వారికి ప్రత్యామ్నాయం కేటాయించి ఈ భవనం దేవస్థానం కు అప్పగిస్తే  బాగుంటుందని శ్రీను బాబు పేర్కొన్నారు.

మండపం కాళీ  చేయిస్తాం..విజయసాయిరెడ్డి చర్యలు...
అప్పన్న ప్రహ్లోధ మండపం త్వరలోనే  కాళీ చేయిస్తాం అని ఎంపీ విజయ్ సాయిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎస్ పి కృష్ణారావు తో చర్చించామని త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తన వినతి పై సానుకూలం గా స్పందించిన  ఎంపీ విజయ్ సాయిరెడ్డి కి శ్రీను బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.