5 నుంచి విశాఖలో మహిళా చలన చిత్రోత్సవం..


Ens Balu
7
Visakhapatnam
2022-03-02 07:37:31

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు మహిళ చలనచిత్రోత్సవం నగరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అభినందనీయమని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక  ఆహ్వనితులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు.  వైజాగ్ ఫిలిం సొసైటీ, వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను బుధవారం  విజేఫ్ ప్రెస్ క్లబ్ లో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన  సింహాచలం దేవస్థానం ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ వైజాగ్ లో మొట్టమొదటిసారిగా మూడు అపురూప చిత్రాలను ప్రతి రోజు సాయంత్రం 5:30 గంటలకు విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నరవ ప్రకాష్ రావు కు అభినందనలు తెలియజేశారు. ఇందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.. వైజాగ్ ఫిలిం సొసైటీ గౌరవ కార్యదర్శి నరవ ప్రకాశరావు మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన 1981లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపు దిద్దుకున్న న్యాయం కావాలి తెలుగు చిత్రం, ఆరో తేదీ ఆదివారం 2016లో నితీష్ తివారి దర్శకత్వంలో వచ్చిన దంగల్ హిందీ చిత్రం, 7వ తేదీ సోమవారం నీగల్ కొలం దర్శకత్వంలో వచ్చిన డేగన్ హోమ్ వంటి అద్భుతమైన చిత్రాలను ప్రదర్శించనున్నట్లు తెలియజేశారు. ఉచిత ఎంట్రీలు కలిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనీ వీక్షించాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు పి.వి.రమణ, బి.  చిన్నారావు, గణేశ్వర బాబ్జి, వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్  అద్యకులు  జ్యోతిర్మయీ,విశాఖ కపుల్స్ కార్యదర్శి డాక్టర్ బి. రజనీ తదితరులు పాల్గొన్నారు.