18న సింహాద్రి అప్పన్నకు పెళ్లి చూపులు..


Ens Balu
4
Simhachalam
2022-03-02 09:14:45

విశాఖజిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం త్వరలో నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ఈ నెల 18న అప్పన్న డోలోత్సవం(పెళ్లి చూపులు) ఘనంగా నిర్వహించడానికి అర్చకవర్గం ఏర్పాటు చేస్తున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు.  బుధవారం సింహాద్రి నాధుడు ను దర్శించుకున్న శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, ఆరోజున సింహాద్రి నాధుడు ను సర్వాభరనాలుతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొండ దిగువన కొలువున్న తన సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి స్వామి రావటం జరుగుతుందన్నారు.  అక్కడ డోలోత్సవం కార్యక్రమం నిర్వహించిన అనంతరం స్వామి అక్కడి నుంచి సంతోషంగా బయలుదేరుతారు.. తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి  తొలుత నిరాకరించిన అమ్మవారు ఆ తర్వాత అంగీకరించిన నేపథ్యంలో అర్చక వర్గాలు  అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనందము గా గడుపుతారు, తదుపరి పుష్కరణి, సత్రంలో స్వామి వారిని ఆశీనులను చేసి వేద మంత్రాలునడుమ ,మృదు మధుర మంగళ వాయీద్యాలుతో స్వామివారికి ఉయ్యాల సేవ నిర్వహిస్తారన్నారు. స్వామి తిరువీధి కార్యక్రమం పూర్తికాగానే తిరిగి కొండపైకి చేరుకుంటారని శ్రీనుబాబు వివరించారు. ఇక ఉగాది పర్వదినం రోజున
శాస్త్రోక్తంగా పెళ్లిరాట లు వేయడంతోపాటు ఆరోజు నుంచి పెళ్లి పనులు ప్రారంభిస్తారన్నారు.. అదే రోజున స్వామి పాదాలను సూర్య కిరణాలు తాకుతా యన్నారు.. ఆ రోజు నుంచి  స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు.. అంగరంగ వైభవంగా జరిగే ఆయా కార్యక్రమాలకు ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో   అధికారవర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్టు శ్రీనబాబు మీడియాకి వివరించారు.