ఆర్గాన్స్ ట్రాన్స్ పోర్టు కోసం తూ.గో.జి ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు ప్రత్యేక గ్రీన్ ఛానల్..
Ens Balu
6
Kakinada
2022-03-03 18:05:39
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు మరోసారి మానవీయతతో మార్గదర్శిగా మారి అవయవ దానం చేయడానికి గ్రీన్ ఛానల్ కోసం ముందస్తు దారి ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయాలై బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి యొక్క అవయవాలను ఒకదాన్ని విశాఖపట్నం, మరో దానిని హైదరాబాద్ తరలించడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా అర్దరాత్రి దాటిన తరువాత అవయవాలను ఆసుపత్రికి తరలించడానికి ప్రత్యేక ట్రాన్స్ పోర్టుకి
పోలీస్ స్టేషనల్ల వారీగా ప్రత్యేక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాద్ బాబు ముందుచూపుతో బ్రెడ్ డెడ్ అయిన వ్యక్తి మరో ఇద్దరికి ప్రాణం పోస్తున్న తరుణంతో ఆ మంచి కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేని రోడ్డు ప్రయాణానికి మార్గం సుగమం చేయడానికి డిఎస్పీ, సిఐ, స్టేషన్ ఎస్ఐలు ఇలా ఒక పెద్ద నెట్వర్క్ నే ఏర్పాటు చేసి ఈ అర్ధరాత్రి అవయవాలాను గమ్యం చేర్చనున్నారు. ఆ రూట్ మ్యాప్ మీడియాకి, టీవీ ఛానళ్లకు, మొబైల్ న్యూస్ యాప్స్ కి విడుదల చేసి ముందుగానే కాకినాడ నుంచి విశాఖపట్నం వరకూ అదేవిధంగా.. కాకినాడ నుంచి హైదరాబాద్ వరకూ ప్రత్యేక వ్యవస్థద్వారా అవయవాలను తరలించడంలో కీలక భూమిక పోషించారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు ఎదరుకు కాకుండా ట్రాన్స్ పోర్టు నెట్వర్క్ ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకున్నారు.