కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు


Ens Balu
3
Visakhapatnam
2022-03-05 14:17:32

విశాఖ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో  వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కొత్త కార్యాలయాలు ఏర్పాటుకు  అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాల పునర్విభజన, కార్యాలయాల ఏర్పాటు, తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జిల్లా కార్యాలయాలు అన్ని ఏర్పాటై పని చేయాల్సి ఉంటుందన్నారు.  కొత్త జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఉంటే అందులో పని చేయాల్సి ఉంటుందన్నారు. స్వంత భవనాలు లేకపోతే ప్రైవేటు భవనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చూసుకోవాలని తెలిపారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, తదితర వాటి గూర్చి వివరాలను కలెక్టరేట్ కు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి,  అనకాపల్లి ఆర్డీవో జె. సీతారామారావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.