సేవామూర్తులను గౌరవించడం అభినందనీయం..


Ens Balu
13
Visakhapatnam
2022-03-09 10:52:01

ప్రపంచంలో ఆత్మీయతను పంచే అమ్మ మహిళా స్వరూపమని అలాంటి మహిళ స్థానంలో ఉండి ఆరోగ్య సేవలు అందించే ఏఎన్ఎంలను, వారి సేవలను గుర్తించి గౌరవిడంచడ శుభప్రధమని జివిఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్, విజేఎఫ్ అధ్యక్షులు, సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడు గంట్ల శ్రీనుబాబులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలోని జివిఎంసీలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించనున్న... సేవాస్పూర్తి అవార్డుల ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జివిఎంసి పరిధిలో  ఏఎన్ఎమ్ లు చేస్తోన్న సేవలను గుర్తించి వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషదాయకమన్నారు. అసోసియేషన్ చేస్తున్న అన్ని కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారం ఉంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో స్పూర్తిదాయంగానూ నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రతినిధులను అభినందించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ,  అసోసియేషన్ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతున్నామన్నారు. ఇందులోభాగంగా  సేవ స్ఫూర్తి అవార్డు 2022 ను ప్రజలకు నిరంతరం సేవ చేసేవారిని గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు యస్. రామకృష్ణ, కె. మదన్, గురు ప్రసాద్, జనార్దన్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.