సివిల్ పంచాయతీలు చేస్తే ఇంటికి పంపిస్తా.. ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్


Ens Balu
5
Kakinada
2022-03-09 15:02:16

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు మళ్లీ దూకుడు పెంచారు. జిల్లాలో చాలా పోలీస్ స్టేషన్ లలో సివిల్ పంచాయతీల్లో పోలీసు సిబ్బంది తలదూర్చడం, దానిపై అధికంగా ఫిర్యాదులు రావడంతో తన దూకుడు వేగం పెంచారు. ఇటీవలే మండపేట పోలీస్ స్టేషన్  ఘటనను ఉదహరిస్తూ నేరుగా వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం జిల్లాలో సంచలనం అవుతోంది. సాధారణంగా సివిల్ కేసుల విషయంలో జిల్లా పోలీసు అధికారులు నేరుగా ఇలాంటి వ్యవహారాలు చేసే వారికి వార్నింగ్ లు ఇస్తుంటారు. ఆపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఎం.రవీంధ్రనాధ్ బాబు వచ్చినప్పటి నుంచి  పోలీస్ స్టేషన్లలో అవినీతిపాల్పడే వారిని గుర్తించి ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు జిల్లాలో డిఎస్పీలు, సిఐలు, స్టేషన్ ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్సు పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడంతో అవినీతి పోలీసు అధికారుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవలే కొంత మంది స్టేషన్ ఎస్ఐలను వీఆర్లోకి పంపిన ఎస్పీ మండపేట ఘటనను తెలియజేస్తూ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది. అదే సమయంలో సిబ్బంది , స్టేషన్ కి వచ్చే వారిపైనా అమర్యాదగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని నేరుగా వార్నింగ్ ఇవ్వడంతో జిల్లా పోలీస్ శాఖలోనే టెర్రర్ మొదలైంది. జిల్లా ఎస్పీ దూకుడు చూస్తుంటే మరో రెండు మూడు నెలల్లో మరికొందరు పోలీసులపై వేటు పడేటట్టు ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి..