తూ.గో.జి.ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుకి హెచ్సార్సీ నోటీసులు..
Ens Balu
9
Kakinada
2022-03-10 07:01:41
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబుకి హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీచేసింది.. జిల్లాలోని మండపేటకి కాళీక్రిష్ణభవగావన్ ఆత్మహత్య కేసు విషయంలో పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించింది. జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి తో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నోటీసులను రామచంద్రాపురం డిఎస్పీ, మండపేట సిఐ, ఎస్ఐలకు కూడా జారీచేసింది. విచారణ నివేదిను ఏప్రిల్ 11వ తేదీలోపు సమర్పించాలని సూచించింది. ప్రేమ వ్యవహారంలో ప్రియురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట సిఐ కాళీ క్రిష్ణ భగవాన్ ను మర్మాంగంపై బలమైన గాయం అయ్యేలా కొట్టారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడనేది ప్రధాన ఆరోపణ. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు ధర్నాచేయడంతో మానవ హక్కుల సంఘం ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఈ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ ఘటన విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ మండపేట సిఐను వీఆర్ లో కి పంపడంతోపాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల పోలీసులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఒక వ్యవస్థలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది తప్పుచేసి దానికి జిల్లా అధికారులే ప్రభుత్వంలో సంజాయిషి ఇచ్చుకోవాలి. అలా మండపేటలో జరిగిన ఘటనపై ఇపుడు జిల్లా ఎస్పీ విచారణతోపాటు సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పకు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు ఇపుడు జిల్లా పోలీసు అధికారులు హెచ్చార్సీకి నోటీసుల రూపంలో సమాధానం చెప్పాల్సి వస్తోంది. హెచ్సార్సీ చైర్మన్ మందాత సీతారామ్మూర్తి, జ్యూడిషల్ సభ్యుడు సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీకి నోటీసులు జారీచేశారని సెక్షన్ ఆఫీసర్ బి.తారక నరసింహ కుమార్ తెలియజేశారు.