ఈ తేదీల్లోనే పీజీ, ప్రొఫిషనల్ కోర్సుల పరీక్షలు..
                
                
                
                
                
                
                    
                    
                        
                            
                            
                                
Ens Balu
                                 5
                            
                         
                        
                            
ఆంధ్రాయూనివర్శిటీ
                            2020-09-16 19:12:36
                        
                     
                    
                 
                
                    ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, ప్రొఫిషనల్ కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు పీజీ పరీక్షల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.ఆదిలక్ష్మి తెలియజే శారు. బుధవారం ఆమె ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, సైన్సు కోర్సులకు సెప్టెంబరు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఆర్టస్ విభాగంలో తొలిదశలో సెప్టెంబరు 28 నుంచి ఆర్టస్ విభాగంలో ఆంత్రపాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు, ఫైన్ ఆర్టస్, హిందీ, సంస్కృతం, యోగా కోర్సులకు,  రెండో దశలో అక్టోబరు 7వ తేదీ నుంచి కామర్స్-మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, చరిత్ర, ఆర్కియాలజీ, హెచ్‌ఆర్‌ఎం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, సంగీతం, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, థియేటర్ ఆర్టస్, వుమెన్ స్టడీస్, సోషియాలజీ, హెచ్‌ఆర్‌డి కోర్సులకు పరీక్షలు జరుగుతాయన్నారు. లా పరీక్షలు అక్టోబరు 7 నుంచి, బిఫార్మరీ పరీక్షలు 21 సెప్టెంబరు నుంచి , బిఇడి పరీక్షలు అక్టోబరు 8 నుంచి నిర్వహిస్తారు. పూర్తి వివరాలను ఏయూ వెబ్‌సైట్ నుంచి పొందాలని సూచించారు.